Site icon NTV Telugu

Summer Holidays: ఎండాకాలం సెలవులు ఎప్పటి వరకంటే..

Andhra Pradesh Schools

Andhra Pradesh Schools

Summer Holidays: తెలంగాణ సర్కార్ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా అని చూసే వారికోసం ఎండాకాలం సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 25నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 25నుంచి జూన్ వరకు అనగా.. 48రోజులపాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవులను ఇవ్వనుంది.

Read Also: Reactor Blast: భూదాన్ పోచంపల్లిలో పేలిన రియాక్టర్

ఇదిలా ఉంటే.. విద్యార్థుల సమ్మెటివ్ అసెస్మెంట్ -2 పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం జరిగే పరీక్షలు కాస్త ముందుకు జరిగాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అందులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 12నుంచి పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎండలు మండిపోతుండటంతో మార్చి రెండవ వారం నుంచి ఒక పూట బడులను నడపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వరకు జరుగుతాయి.

Read Also:CM KCR: ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?

Exit mobile version