NTV Telugu Site icon

TS Govt: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

Revanth Reddyt

Revanth Reddyt

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని పేర్కొ్న్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాల పై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Amit Shah: ఎన్నికల ముందే సీఏఏ అమలు.. అమిత్ షా సంచలన ప్రకటన..

తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.. కాంగ్రెస్ ఆరు హామీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Bandi Sanjay: బండి సంజయ్ ఏం చేశాడు? వారికి సమాధానమే ఈ ప్రజాహిత యాత్ర