TNGO: సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతల రియాక్షన్ ఇదే..!
- రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం
- ఏర్పాటైన సబ్ కమిటీ ఏడు నెలలుగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శ.
- సీఎం చర్చకు రావాలని పిలిచినా మంత్రులు స్పందించకపోవడంపై ఆగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TNGO: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సబ్ కమిటీ ఏర్పాటైనప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం (TNGO) అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి., సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలిచారు.. కానీ మంత్రులు మాత్రం చర్చకు సమయం కేటాయించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం విజ్ఞప్తులకు స్పందించకపోవడం వాస్తవమే. ఆర్థిక సమస్యలు పక్కన పెట్టినప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మేము సమరం కాదు, ఉద్యమం చేస్తున్నాం. మంత్రుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నాం. అడగొద్దు అంటే అడగం. మేమే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చాం అని ఆయన పేర్కొన్నారు.
Also Read
అలాగే, TNGO ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే గౌరవం. మీరు తండ్రి పాత్రలో ఉన్నారు. మీరు ఇచ్చిన గంట సమయం మాకు విలువైనది. కానీ, మిగిలిన మంత్రులు మాత్రం మాట్లాడటం లేదు. ప్రజలపై యుద్ధం చేయాలని మేము కోరడం లేదు. సబ్ కమిటీ అనే మీ ఏర్పాటు చేసిన బృందం అసలు మాట్లాడటానికి ముందుకు రావడంలేదు. సీఎం చెప్పినట్లే, కొంతమంది సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారు. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడండి. ప్రభుత్వానికి డబ్బుల్లేవన్న విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ, మాతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. కోట్ల రూపాయలు అడగడం లేదని ఆయన అన్నారు. మొత్తంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తమ అంచనాలను స్పష్టంగా తెలియజేస్తూ సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!