Site icon NTV Telugu

Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!

Employees Transfers

Employees Transfers

Telangana Employee Transfers: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు పనిచేసిన కాలం, వ్యక్తిగత పరిస్థితులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మే 1నుంచి మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 01-01-2026 నాటికి ఓ నిర్దిష్ట స్థానంలో కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అయితే జీవిత భాగస్వామి కారణాలతో బదిలీ కోరే ఉద్యోగులకు ఈ మూడు సంవత్సరాల షరతు వర్తించదు. వారికి ప్రత్యేక సడలింపు ఇవ్వబడింది.

రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

అదేవిధంగా 31-12-2025 నాటికి ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-05-2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు.

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

ఇక పరిపాలనలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఒకే కేడర్‌లో 40% కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలతో బదిలీ ప్రక్రియను సమతుల్యంగా నిర్వహించాలనే ఉద్దేశం ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్గదర్శకాలతో ఉద్యోగుల బదిలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉండనుంది.

Exit mobile version