NTV Telugu Site icon

KTR Press Meet: అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్

Ktr

Ktr

KTR Press Meet at TUWJ: తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదని, అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరూ రెండో శ్రేణి పౌరులు అంటూ ఉండరన్నారు. తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ మీట్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.

‘ఎట్లా ఉండే తెలంగాణ.. ఎట్లా అయ్యింది అన్నది ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుందని దేశం అనుసరిస్తుంది. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోంది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్. తెలంగాణ కర్ఫ్యూ లేదు.. కరువు లేదు. మోడీ హయాంలో పేదరికంలో నైజీరియాను ఇండియా దాటింది. దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్-5లో ఉంది. ఒక్క పైసా అప్పు చేసిన ఉత్పదాక రంగం మీద పెట్టారు సీఎం కేసీఅర్. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతుంది అక్కడి ప్రభుత్వం. మన దగ్గర 24 గంటల కరెంట్’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

‘కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయి. కానీ బీఆర్ఎస్ అలా కాదు. అప్పట్లో ఒక ప్రభుత్వం ప్రో అర్బన్, ప్రో ఐటీ రంగంపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత వచ్చిన సర్కార్ వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. కేసీఅర్ సర్కార్ పూర్తి సమతూకంతో ముందుకు సాగుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. పట్టణ, పల్లెల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. వ్యవసాయంలో ముందుకు దూసుకుపోతుంది. పంజాబ్, హర్యాలను దాటింది. రాష్ట్రంలో ఏ మూలాన వెళ్లినా పచ్చదనమే కనబడుతుంది’ కేటీఆర్ తెలిపారు.

Also Read: Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!

ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ కాకుండా దేశంలో వేరే రాష్ట్రం ఒక్కటి అయినా ఉందా?. టీచర్ రిక్రూట్ మెంట్ అంటే ఒక డీఎస్ఈ నేనా?.. గురుకులాల్లో వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. కర్ణాటక నుంచి రైతులను స్పాన్సర్ చేసి తీసుకువస్తున్నారు అని కాంగ్రెస్ నేత అంటున్నారు. మరి మనం పోదాం కర్ణాటకకు.. అక్కడి వెళ్లి ఏం జరుగుతుంది చూద్దాం. మేము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదు. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు’ అని కేటీఆర్ చెపుకొచ్చారు.