Kukatpally Congress Candidate Bandi Ramesh Slams BRS Govt: గడీల మధ్య తెలంగాణ బందీ అయిందని, ఒక హోం మంత్రికి గెటు లోపలికి కూడా అనుమతి ఉండదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ విమర్శించారు. ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారని మండిపడ్డారు. సూటు కేసుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం తాను వచ్చానని బండి రమేష్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన బండి.. తాను ఎదిగిన చోట ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి.. ఆపై టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులలో కొనసాగారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో బండి రమేష్ మాట్లాడుతూ… ‘కూకట్ పల్లి నియోజక వర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి ధన్యవాదాలు. వెంగళరావు వెళ్ళాడని నేను అనుకోవడం లేదు. అయన బాధ, అవేదన తెలిసిన వ్యక్తిని నేను. సూటు కేసులుతో రాజకీయాల్లోకి రాలేదు… పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని నేను. కేసీఆర్ అడుగు జాడల్లో ఏ పని ఇచ్చినా గెలిపించిన చరిత్ర నాది. ఇన్నాళ్లు పార్టీలకి సేవ చేశా.. ఇక ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మెట్టమెదట ఇఇచ్చిన మాట తప్పారు. తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీలో విలీనం ఆన్నారు, దళిత ముఖ్యమంత్రి ఆన్నారు కానీ ఎది చేయలేదు’ అని అన్నారు.
Also Read: Puneeth Rajkumar: ప్రజల మనస్సులో నిలిచి మరణాన్ని జయించిన పునీత్ రాజ్ కుమార్..
‘పైపై మెరుగులు దిద్దడం డెవలప్ కాదు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనే ఫ్లై ఓవర్లు కట్టారు. డ్యాంములు కట్టింది కాంగ్రెస్ అయంలోనే. ఉన్న రోడ్లు మాత్రమే ఇప్పుడు డెవలప్ చేశారు. ప్రభుత్వ స్కీంలు అన్నీ తెలంగాణ పుట్టక ముందువే. గడీల మధ్య తెలంగాణ బందీ అయింది. ఒక హోం మంత్రికి కూడా సీఎం గెటు లోపలికి అనుమతి ఉండదు. ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారు. చెరువులు ఎలా కుజించుకపోయాయో నాకు తెలుసు. కూకట్ పల్లికి నేను కొత్త కాదు.. పీజేఆర్ నాకు రోల్ మాడల్. కూకట్ పల్లిని అభివృద్ధి చేస్తా’ అని బండి రమేష్ చెప్పారు.