Telangana: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనను పట్టించుకోకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11 నుండి వెబ్ సైట్‌లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ ఉండనున్నాయి. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు డీఎస్సీ జరగనున్నాయి.
Read Also: ITBP: సైన్యంలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా పోస్టులు..అర్హతలివే..