Bhatti Vikramarka: ముఖ్యమంత్రిగా పనిచేసి దశాబ్ధం ముగిసినా ప్రజల గుండెల్లో ఉన్న సీఎం వైఎస్సార్ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాలన ఎలా ఉండాలో వైఎస్సార్ చేసి చూపించారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళ మాదిరి వైఎస్సార్ చేశారని అన్నారు. ఉచిత కరెంటు రైతులకు ఇవ్వటం ద్వారానే వారి ఆత్మహత్యలు ఆపగలం అని వైఎస్సార్ నమ్మి ఆ పని చేశారన్నారు.
Read Also: CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్దులకు వైఎస్సార్ అండగా నిలిచారన్నారు. శాసనసభలో, శాసనమండలిలో కలిసి పనిచేయటం నా అదృష్టమంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి ఒక రోజు గ్యాప్ ఇద్దామని మేం కోరినా వైఎస్సార్ ఆ రోజు వినలేదన్నారు. ప్రజల కోసం ఒక్క నిమిషం కూడా వృథా చేయనని చెప్పి వెళ్లిన వైఎస్సార్ శాశ్వతంగా దూరమయ్యారమంటూ భట్టి చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పాలనలోని అంశాలు ఇప్పుడు దేశ పాలనలో అజెండాగా మారాయన్నారు. తాను, రేవంత్ రెడ్డి ఒకేసారి శాసన మండలికి వెళ్లామని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల నుంచి ఇద్దరం మండలికి వెళ్లామని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయాలనేది వైఎస్సార్ కోరిక అని.. అది నేరేవేర్చే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని భట్టి విక్రమార్క సూచించారు.