Site icon NTV Telugu

Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. మహిళ గొంతుకోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు!

Murder

Murder

Woman strangled to death in Telangana: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామంలో మల్లవ్వ (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతు కోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మల్లవ్వ గొంతు కోసి అతికిరాతంగా చంపేశారు. గొంతు కోయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మల్లవ్వ చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులు లేకపోవడంతో దుండగుల పని ఈజీ అయింది.

Also Read: IND vs ENG Test: అశ్విన్ మాయాజాలం.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!

శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మల్లవ్వ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version