Site icon NTV Telugu

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో చీలికలు.. రెండుగా చీలిన హస్తం

Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. నిన్నటి వరకు సీనియర్లు తమకు సముచిత గుర్తింపు దక్కడం లేదంటూ.. నేటి ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌ను బైకాట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పీసీసీ కమిటీలో పదవులు దక్కి సీనియర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన నేతలు పీసీసీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ రెండుగా చీలి ఓవైపు రేవంత్‌ రెడ్డి వర్గం.. మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ వర్గం ఎవరికి వారు విమర్శలు చేస్తున్నారు. మాకు పని మాత్రమే ముఖ్యమని పదవులతో సంబంధం లేదని రేవంత్‌ రెడ్డి వర్గీయులు అంటున్నారు. ఇదే సమయంలో.. ఎన్టీవీతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజలంతా టీఆర్ఎస్ మీద అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు కానీ నాయకుల వ్యవహార శైలి ప్రజలని అసంతృప్తికి గురిచేస్తుందన్నారు.
Also Read :A Strange Case: భర్తపై భార్య అత్యాచారం.. 29 గంటలపాటు ఏకధాటిగా
మాకు పదవులు ఇవ్వడమే పెద్ద నేరం అన్నట్లు నిన్న మాట్లాడిన నేతలు భావిస్తున్నారని, కేసీఆర్‌ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని భావనతో ప్రజలు ఉన్నారని, ఇలా నాయకులం పోట్లాడుకోవడం ప్రజలు సహించరన్నారు. కేసీఆర్‌తో కొట్లాడటానికి సీనియర్ నేతలకు మా పదవులే అడ్డంకి అని భావిస్తున్నారని, మా పదవులే అడ్డంకి అనుకుంటే మాకు పదవులు అక్కరలేదన్నారు. అందుకే మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి మేం పని చేస్తామని సీతక్క వ్యాఖ్యానించారు.
Also Read : BIG BREAKING : కాంగ్రెస్‌లో 12 మంది రాజీనామా.. మాణిక్కం ఠాగూర్‌కు లేఖలు

Exit mobile version