Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ వచ్చే అవకాశం
- ప్రస్తుతం ఇంచార్జ్‌గా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్
- ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్న మీనాక్షి
- మరో రెండు నెలలు మీనాక్షి ఇంచార్జ్‌గా కొనసాగే అవకాశం
- కొత్త ఇంచార్జ్ కోసం అధిష్టానం కసరత్తు
- సీనియర్ నేతను నియమించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా.? ప్రస్తుతం ఉన్న మీనాక్షి నటరాజును అధిష్టానం తప్పిస్తుందా.? ఇప్పటికప్పుడు నిర్ణయాలు ఉంటాయా.? ఉంటే కొత్త ఇంచార్జ్ ఎవరు.? తెలంగాణకు వచ్చే వారెవరు.? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ కొనసాగుతున్నారు. అయితే చాలా రోజులుగా మీనాక్షి నటరాజన్ విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె 10 నెలల పాటు విదేశాల్లో చదువుకున్నారు. అప్పట్లో రాహుల్ గాంధీ నో చెప్పారు. కానీ ఉన్నత చదువుల కోసం వచ్చిన అవకాశం వదులుకోవడం ఎందుకు అనే ఆలోచనతో పార్టీ నాయకత్వానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు హై కమాండ్ అంగీకారం తెలిపింది.
అయితే త్వరలోనే విదేశాల్లో చదువుకోవడం కోసం మళ్లీ వెళ్ళబోతున్నారు మీనాక్షి నటరాజన్. అయితే మరో రెండు నెలల పాటు ఇంచార్జ్ గా మీనాక్షినే కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంచార్జ్ మీనాక్షి ప్లేస్ లో కొత్తవారు రావడం అనేది పక్కగా కనిపిస్తుంది. అయితే కొత్త ఇంచార్జ్ గా సీనియర్ నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఇద్దరు ముఖ్యనేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
వీరిలో ముందు వరసలో ఎంపి సెంధిల్ పేరు ఉంది. రాహుల్ గాంధీ కోటరీలో కీలక నాయకుడిగా సెంధిల్ కి మంచి పేరుంది. తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎంపి చల్లకుమార్ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్లు టాక్. సీనియర్ నాయకుడు ముకుల్ వాసనిక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నాయకులకు వాసనిక్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంతో అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుంది..? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి తమిళనాడుకు చెందిన నాయకులు ఇంచార్జ్ గా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సెంతిల్ కు పార్టీలో మంచి పేరు ఉంది. గాంధీ కుటుంబానికి విధేయుడు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మూడు పేర్లలో ఒకరు తెలంగాణ ఇంచార్జ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నియామకం ఎప్పుడు అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!