కాసేపట్లో గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమవేశానికి ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేసే అవకాశం ఉంది. నియోజక వర్గాల బాధ్యత అప్పగించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. జనవరి 26 తర్వాత నియోజకవర్గస్థాయిలో పాదయాత్రలు చేయాలన్నది ఏఐసీసీ నిర్ణయం. అయితే.. దీనిపై జిల్లా అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం నిర్వహిస్తోంది పీసీసీ. పార్టీ సీనియర్ నాయకులు గాంధీభవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించారు. ఏఐసీసీ ఇచ్చిన సర్యులర్ మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పీసీసీ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. సమస్య పరిష్కారం కోసం సీనియర్లను ఢిల్లీ రావాలంటూ కబురు పెట్టింది. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో తాడోపేడో తేల్చుకునే దిశగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధమయ్యారు.
Also Read : Congress Ex MLA Anil Kumar: పార్టీని బలి చేయకండి.. రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.