CM Revanth: నేడు మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించ నిర్వహించనున్నారు. గిరిజన సంప్రదాయాలకు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు సమాచారం. మహాజాతర నాటికి ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Uttat pradesh: చిన్న కొడుకుతో కలిసి మరిదిని పొట్టు పొట్టు కొట్టిన వదిన
మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకొనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రానున్నారు. మొదటగా, అమ్మవారి గద్దెల విస్తరణ పనుల పై పూజారులతో సమీక్ష నిర్వహించి.. అనంతరం, అమ్మవార్లను దర్శించుకుని, ఆశీస్సులు అందుకోనున్నారు. అమ్మవార్ల దర్శనం అనంతరం, మేడారం అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన డిజిటల్ ప్లాన్ ను ఎలా అమలుపై చర్చలు నిర్వహించనున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే, మేడారంను అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్ బ్లాక్ డ్రెస్ మాయ, ఎలిగెంట్ లుక్‌లో మెరిసిన అందం
సమీక్ష సమావేశం తర్వాత, మేడారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం, స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన పర్యటన సందర్భంగా, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.