Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గద్దర్ జయంతి రోజు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.
Read Also: CM Revanth Reddy : వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి..
నంది అవార్డులను పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు కోరినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.