CM Revanth Reddy: ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రామచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
Read Also: Botsa Satyanarayana: అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చాం.. నష్టపడినా, లాభపడినా ప్రజానీకమే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేపథ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్తానని రేవంత్ నిన్న ప్రెస్‌మీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
