Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.
- ధాన్యం బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి.
- సౌర విద్యుత్ పై సబ్సిడీ ఇవ్వాలని కోరిన మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో 2014-15 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే, సీఎంఆర్ (CMR) డెలివరి గడువును పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి
శ్రీ ప్రహ్లాద్ జోషీతో భేటీ కావడం జరిగింది.2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు…రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు వెంటనే…విడుదల చేయాలని… pic.twitter.com/kYra4iONit
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2025
ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీ విషయమై మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుండి తెలంగాణకు సుమారు రూ.2,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో సంబంధిత పత్రాలను సమర్పించలేదని.. ఇప్పుడు తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, అలాగే వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే, సౌర విద్యుత్ పై సబ్సిడీ కోరినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ప్రధాని కుసుమ్’ పథకం కింద మహిళ సంఘాలకు 4,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, దీనికి సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీతో సహా, సోలార్ పంపులను అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీటి పై సానుకూలంగా స్పందించి, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!