CM Revanth Reddy: నేడు ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఇవాళ (జూలై 7) ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇది కేవలం అధికారిక టూర్ మాత్రమే కాకుండా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర మద్దతు కల్పన, పార్టీ వ్యూహాలపై హైకమాండ్‌తో కీలక చర్చలకు వేదికగా మారనుంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల తెలంగాణ పర్యటన పూర్తిచేసుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ ఢిల్లీ పయనం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also:Zim vs SA: వాళ్లకు కాస్త చెప్పండయ్యా.. అది టీ20 కాదు టెస్టు మ్యాచ్ అని.. ఆ కొట్టం ఏంటయ్యా బాబు..!
Also Read
- CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
- Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
- Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్‌కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
- Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్ఠానం, పార్టీ శ్రేణులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఎరువుల కొరత నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణ ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. రైతుల అవసరాల దృష్ట్యా ఇది అత్యవసరంగా భావిస్తున్నారు.
Read Also:Shubman Gill: ఆ ఒక్క మాటతో మరో మెట్టు ఎక్కేసిన కెప్టెన్ గిల్.. ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ..?
అలాగే, తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జూలై 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ఆహ్వానించాలన్న యోచనలో రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పార్టీలో కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, గ్రౌండ్ వర్క్ పటిష్టతకు రేవంత్ పలు అంశాలను హైకమాండ్‌కు వివరిస్తారు.
జూలై 12 నుంచి 18 వరకూ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాల వివరాలు కూడా సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ కు తెలియజేయనున్నారు. మహిళల అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యాచరణపై సమీక్ష జరుగుతుంది.
తాజావార్తలు
-
CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
-
Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
-
Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్‌కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!