CM Revanth Reddy : ఢిల్లీ వేదికగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్ లో ఎలా అంటాం. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినవి ప్రధానంగా నాలుగు అంశాలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదుల నీటి వాటాల్లో ఉన్న సమస్యలపై ముందుగా ఇంజినీర్లు, అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించాం. ఆ కమిటీలో సమస్యలను గుర్తించి అక్కడ వాటిపై చర్చించిన తర్వాత మిగతా వాటిని సీఎంల స్థాయిలో చర్చిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also : Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్
ఈ ఆఫీసర్ల కమిటీ వేసిన తర్వాత పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులతో పాటు ఏపీ కడుతున్న వాటిపై మన తరఫున అధికారులు కమిటీలో చర్చకు తీసుకువస్తారు. ఈ మీటింగ్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వమే. కొన్ని రకాల అడ్డంకులను తొలగించేందుకు ఈ మీటింగ్ నిర్వహించాం. మేం ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలే ప్రతిపాదన చేశాయి. రెండోది కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ నీటి వాటాల విషయంలో టెలిమెట్రో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మూడోది శ్రీశైలం ప్రాజెక్ట్ కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయించడానికి ఏపీ ముందుకు వచ్చింది. నాలుగోది గోదావరి రివర్ మానేజ్ మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని విభజన చట్టంలో ఉంది. దాన్ని ఇప్పుడు ప్రతిపాదించాం. ఈ అంశాలన్నీ ఇంజినీర్ల కమిటీలో కచ్చితంగా చర్చిస్తారు.
మాజీ సీఎం కేసీఆర్ ఏపీకి అన్ని నదులను దారాదత్తం చేశారు. వాటిని పరిష్కరించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో చాలా అంశాలు పొందుపరిచారు. కానీ అవి అమలు కాలేదు. ఇప్పుడు వాటి గురించి మేం ప్రయత్నాలు చేస్తున్నాం. గత రెండు రాష్ట్రాల సీఎంలు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది అంతగా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు నేను, సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యలకు దారి చూపించాలని అనుకుంటున్నాం. కానీ కొందరు మేం కలుసుకుంటే ఓర్వలేకపోతున్నారు. మాకు సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసు. కానీ బీఆర్ ఎస్ కు వివాదాలను సృష్టించడమే కావాలి. కాబట్టి వారిని మేం పట్టించుకోం అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Also : KTR : మేడిగడ్డమీద కూర్చుని చర్చిద్దాం.. రేవంత్ కు కేటీఆర్ సవాల్..
