Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్.. కీలక అంశాలపై చర్చ

Ts Cabinet

Ts Cabinet

నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చెయ్యాల్సిన పథకాలతో పాటు పథకాల అమలు తీరు, పాలన ఎలా కొనసాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? టీఎస్పీఎస్సీ పరిస్థితి ఏంటి? ఉద్యోగాల భర్తీ ఎలా చేయాలి? లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

Read Also: Indian Police Force OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

×
×
Ad

ఇక, డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుంచి భారీగా తీసుకుంది. వాటిపై ఇవాళ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 17 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేస్తుంది.. తద్వారా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనిపై కూడా నేటి మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: Astrology: జనవరి 08, సోమవారం దినఫలాలు

అలాగే, ప్రజాపాలనలో ఏకంగా కోటి 24 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో.. వారందరూ 6 హామీల కోసం వేచి చూస్తున్నారు.. వంద రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామన్న హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ హామీలను చెప్పిన విధంగా అమలు చెయ్యకపోతే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ప్రజలు షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.