జులై 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంకు మంత్రులు అందరూ హాజరుకానున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీకి ఓ ప్రత్యేకత ఉంది.
Also Read: Virat Kohli: క్రికెట్ జుజుబీ.. అక్కడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!
ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు 18 సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. సుమారు 315 పైచిలుకు అంశాలపై క్యాబినెట్ చర్చించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై ఈసారి సమీక్ష చేయనున్నారు. ప్రతిసారీ జరిగే కేబినెట్ మీటింగ్ హాల్‌లో కాకుండా.. సీఎం మీటింగ్ హాల్‌లో 19వ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
