Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
READ MORE: Telangana Cold Wave: వామ్మో చలి.. ఇంకా రెండు రోజులు గజ గజ వణకాల్సిందేనట..!
కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల 24లోగా తెలియజేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తేలకపోవడం వల్లే అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినప్పటికీ పరిస్థితులు కలిసిరాలేదు. అయితే.. ఎలాగోలా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థ చక్కబడుతుందని అంచనా వేస్తోంది.
READ MORE: Sree Leela : నడుము ఒంపులతో హీటెక్కిస్తున్న శ్రీలీల
