NTV Telugu Site icon

TS Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్

Cabinet Meeting

Cabinet Meeting

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల హోదాలో తొలిసారిగా సచివాలయానికి వస్తున్న తరుణంలో భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. ఇదిలా ఉంటే.. పోలీసులు సీఎంకు, మంత్రులకు గౌరవ వందనం పలికారు.

Weight Loss Tips : ఈ జ్యూస్ లను తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు..

మరోవైపు.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Show comments