మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు.. రోడ్లుపై చర్చ నుంచి వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికు చేపట్టే చర్యలపై ఈ భేటీలో సమీక్ష జరుగనుంది.
Read Also: Sada : రెట్రో లుక్ తో అదరగొడుతున్న హీరోయిన్ సదా..
ప్రత్యామ్నాయ సాగు విధానాలపైనా కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల పెంపు, మహబూబాబాద్ జిల్లా మల్యాలలో హార్టి కల్చర్ కాలేజీ మంజూరు, తదితర అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గృహలక్ష్మి పథకం అమలుతో పాటు బీసీ, మైనారిటీ బంధు అమలుపైనా కూడా ఈ సమావేశంలో చర్చ జరుగనుంది.
Read Also: Nizamabad: ఎంపీ అర్వింద్‌కు షాక్.. కార్యాలయం ముందు సొంత పార్టీ నేతలు నిరసన
వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు స్థల సేకరణ, రన్ వే పొడిగింపుపై తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నిమ్స్ ఆసుపత్రి కొత్త భవనానికి మహారాష్ట్ర బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే అంశంపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్త గ్రామ పంచాయితీలు, రెవెన్యూ మండలాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరికొన్ని కొత్త నిర్ణయాలు కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 3 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు.
