NTV Telugu Site icon

TG Cabinet: భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Tg Cabinet

Tg Cabinet

TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్‌ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేటీఆర్‌ ఈ-ఫార్ములా రేస్‌ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్‌ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.

Read Also: TPCC: ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్

కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం వారి అహంకారపురిత మాటలకు నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంగా విమర్శలు చేయడంలో తప్పు లేదన్నారు. కక్ష పూరితంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని.. తప్పులను బయటకు తీసి చర్చలో పెట్టామని మంత్రి పేర్కొ్న్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.