CM Revanth Reddy : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు క్లారిటీ..?

  • ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సీఎం రేవంత్
  • రాహుల్ గాంధీతో సీఎం కీలక చర్చలకు సిద్ధం
  • ఐదుగురు కొత్తవారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం
Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అదే విధంగా, ఇవాళ ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమై విస్తరణపై తుదిరూపురేఖలు ఖరారు చేసే అవకాశముంది. విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

Maharashtra: మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. నదులుగా మారిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు

ఇప్పటికే రెండు నెలల క్రితమే విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లతో రాష్ట్ర నేతలు పలు విడతలుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. పలువురు నాయకుల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి పదవికి తమకే అవకాశం ఉందంటూ కొందరు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Chennai: 326 మంది ప్రయాణికులతో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో..