తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 27 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ .. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
READ MORE: Global Terrorism Index 2025: టెర్రరిజంలో రెండో స్థానంలో పాకిస్తాన్.. భారత్ స్థానం ఎంతంటే..
ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించారు. నిరుద్యోగులకు సైతం శుభవార్త చెప్పారు. కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్