తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Read Also: Revanth Reddy: బీఆర్ఎస్‌పై నిప్పులుచెరిగిన సీఎం రేవంత్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. కాగా.. ఈనెల 12, 13వ తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.
Read Also: Delhi: ఉద్యోగాల స్కామ్‌లో రబ్రీదేవి, కుమార్తెలకు మధ్యంతర బెయిల్
