NTV Telugu Site icon

TS BJP: తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ లకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన

Bjp

Bjp

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వాళ్ళను అసెంబ్లీకి పోటీ చేయించడం.. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది.

Read Also: Batukamma Celebrations: బతుకమ్మ సంబరాల్లో స్టార్ మా సీరియల్ నటులు.. అభిమానులతో కలిసి సందడి.

అయితే, ఇవాళ బీజేపీ అభ్యర్థులపై తుది కసరత్తు కొనసాగుతుంది. రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆమోదం పొందనుంది. తొలి జాబితాలో 50 నుంచి 70 సీట్లను ప్రకటించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అయితే, అంతకు ముందు జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఇక, సమావేశం తర్వాత ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ బయటకు వెళ్లిపోయారు.

Read Also: Sara Tendulkar: క్రికెట్ స్టాండ్లో సారా టెండూల్కర్ హల్చల్.. గిల్ క్యాచ్ పట్టగానే ఏం చేసిందంటే..!

ఇక, తెలంగాణలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా నజర్ పెట్టింది. గతంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేట్‌ సీట్లను కమలం పార్టీ గెలుచుకుంది. దీంతో బీజేపీ అధిష్టానం గత కొంత కాలంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో యూపీలో పనిచేసిన సునీల్ బన్సల్ నేతృత్వంలోని బృందం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై దృష్టి సారించింది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుంది.