NTV Telugu Site icon

Kishan Reddy: ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటేసినా.. మజ్లిస్ కు ఓటేసినట్లే..

Kishan Reddy

Kishan Reddy

చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరినీ చైతన్యం చేసి తెలంగాణను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి బీఆర్ఎస్ పార్టీని, అహంకార పూరిత కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీలు.. ఇద్దరూ ఇప్పుడు ఏకమై పనిచేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

Read Also: Accident: ట్యాంకర్‌, రోల్స్‌ రాయిస్ ఢీ.. ట్రక్కులోని ఇద్దరు మృతి, కారులోని వారు సేఫ్‌

కాంగ్రెస్ పగటికలలు కంటున్నది.. తెలంగాణలో 75 శాతం మంది.. ఈ అవినీతి, అక్రమ, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫి పేరుతో రైతులను మోసం చేస్తున్నారు.. నాలుగున్నర సంవత్సరాలుగా.. వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ పేరుతో.. లక్ష.. ఇంకో లక్ష అయింది.. ప్రభుత్వ భూములను అమ్ముకుంటా.. రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ అంటున్నారు అని కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ, 60 శాతం రైతుల అకౌంట్లలో రుణమాఫి పడలేదని ఆయన అన్నారు.

Read Also: Siddharth Chandekar: తల్లికి రెండో పెళ్లి చేసిన హీరో సిద్దార్థ్.. ఫొటోస్ వైరల్

దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ.. తెలంగాణను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే.. అది కాంగ్రెస్ కు ఓటేసినట్లే.. కాంగ్రెస్ కు ఓటేస్తే.. బీఆర్ఎస్ కు ఓటేసినట్లే.. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఓటేసినా.. మజ్లిస్ కు ఓటేసినట్లేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Read Also: CM KCR: మెదక్ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అహంకారపూరిత పార్టీలు అని ఆయన విమర్శించారు. అందుకే ఆలోచించి.. ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలి.. ఇందుకోసం కార్యకర్తలు పనిచేయాలి.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. మోడీ నేతృత్వంలోని బీజేపీకి అవకాశం ఇవ్వండి.. తెలంగాణ అభివృద్ధికి కొత్త మలుపు.. బీజేపీ గెలుపు.. పార్టీ కార్యకర్తలందరూ సైనికులుగా పనిచేస్తూ.. పార్టీకి మద్దతు కూడగట్టాలి అని కిషన్ రెడ్డి అన్నారు.