Siddharth Chandekar: తల్లికి రెండో పెళ్లి చేసిన హీరో సిద్దార్థ్.. ఫొటోస్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth Chandekar: సాధారణంగా భారతదేశంలో భర్త చనిపోయాక రెండో పెళ్లి చేసుకోవడానికి చాలామంది మహిళలు భయపడతారు. సమాజం ఏమంటుంది..? బంధువులు ఏమంటారు.. ? పిల్లలు ఏమంటారు.. ? అని భయపడుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోకూడదు అని ఏ రాజ్యాంగంలో రాసి లేదు. పెళ్లి అనేది తోడు కోసం చేసుకునేది. 50 వయస్సు దాటాక ఇలాగే ఉండాలి అనే కట్టుబాట్లను నేటి జనరేషన్ యువత మార్చేసింది. తన తల్లిదండ్రులు ఆ వయస్సులో ఒంటరితనాన్ని అనుభవించకూడదని వారిని ఒప్పించి మరీ రెండో పెళ్లి చేస్తున్నారు. తాజాగా మరాఠీ నటుడు సిద్దార్థ్ ఛందేకర్.. తన తల్లికి రెండో పెళ్లి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్.. తన తల్లి సీమా ఛందేకర్ కు వివాహం జరిపించాడు. ఆమె పెళ్లి ఫోటోలను అభిమనులతో షేర్ చేస్తూ.. తన జీవితంలో ఇదే బెస్ట్ వెడ్డింగ్ అంటూ రాసుకొచ్చాడు.
“హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మా.. నీ పిల్లలతో పాటు.. నీక్కూడా మంచి భవిష్యత్ ఉంది. నీకు అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు నువ్వు నీ బిడ్డల కోసం చాలా త్యాగం చేశావు. ఇక ఇప్పుడు నీ గురించి, నీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో నీకు మేమెప్పుడూ సపోర్ట్ గా ఉంటాము. నా పెళ్లి నువ్వెంత గ్రాండ్ గా చేశావో .. ఇప్పుడు నీ పెళ్లి నేను అంతే గ్రాండ్ గా చేశాను. నా జీవితంలో నేను ఎక్కువగా ఇష్టపడిన పెళ్లి అంటే ఇదే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోస్ చూసిన అభిమానులు.. మంచి పని చేసావ్ సిద్దార్థ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!