Site icon NTV Telugu

Telangana Aviation Director : ఫ్యూయల్ బ్లాక్ అనేది కారణమే కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్

Aviation

Aviation

Telangana Aviation Director : అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. విమాన సాంకేతికత, భద్రతా ప్రమాణాల గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆయన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. భరత్ రెడ్డి మాటల ప్రకారం, ఒక ఇంజన్ ఆగిపోతే మరొకటి పని చేస్తుందన్న భావన సరికాదని అన్నారు. టేక్ ఆఫ్ కు ముందు రెండు ఇంజిన్లను పూర్తిగా పరిశీలించి అన్ని సరిగ్గా ఉన్నాయా అని చూసిన తర్వాతే విమానాన్ని రన్ వే మీదకు అనుమతిస్తారని తెలిపారు. ఆ సమయంలో రెండు ఇంజిన్లు ఒకేసారి పనిచేస్తాయని స్పష్టం చేశారు.

Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!

అలాగే, ఫ్యూయల్ బ్లాక్ ఒక్కదానితోనే ప్రమాదం జరిగిందనేది తప్పుడు అభిప్రాయమని చెప్పారు. ఇంజన్ లో ఫ్యూయల్ బ్లాక్ ఏర్పడినా, మిగిలిన ఫ్యూయల్ ఆధారంగా విమానం తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి సురక్షితంగా ల్యాండ్ కావడం సాధ్యమేనని వివరించారు. పక్షుల ఢీ కూడా ప్రమాదానికి పెద్దగా కారణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఎయిర్‌పోర్ట్‌లోనూ పక్షుల సంచారం సాధారణమే అయినా, ఒకేసారి రెండు ఇంజిన్లలోకి పక్షులు ప్రవేశించడం చాలా అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. అది అత్యంత అసాధ్యమైన ఘటనగా అభివర్ణించారు.

మే డే సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా పలు విమాన ప్రమాదాలు తప్పించుకున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. కానీ ఈసారి ఘటన కేవలం 40 సెకన్లలో జరిగిపోయిందని, పైలట్‌కు విమానాన్ని నియంత్రించుకునే అవకాశం కూడా లభించలేదని అన్నారు. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేసే టెక్నాలజీ వల్లే విమానం గాల్లో ఎగురుతుంది. కానీ ఆ టెక్నాలజీ విఫలమైనప్పుడు విమానం కుప్పకూలే ప్రమాదం తప్పదని చెప్పారు. విమానంలో ఉన్న వింగ్ బ్లేడ్‌లు కూడా విమాన స్థిరత్వానికి కీలకంగా పనిచేస్తాయని, ఒక్క బ్లేడ్ కూడా సరిగ్గా పని చేయకపోతే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపారు.

Assam tension: హనుమాన్ ఆలయంలో ఆవు మాంసం..‘‘షూట్-అట్-సైట్’’ ఆర్డర్స్ ఇచ్చిన సీఎం..

Exit mobile version