Site icon NTV Telugu

TS Assembly Sessions : డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Cm Kcr

Cm Kcr

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. అయితే.. వారం రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి లకు ఆదేశించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణకు రావాల్సి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు సీఎం కేసీఆర్‌. అభ్యుదయ ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది.

Read Also : Sanjanaa Galrani : చక్కటి ప్లానింగ్‌తో ‘మణిశంకర్’ మూవీ!

ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.
Read Also : Minister Roja: చంద్రబాబు వీధి రౌడీలా మారారు.. మంత్రి రోజా హాట్ కామెంట్స్

Exit mobile version