Sanjanaa Galrani : చక్కటి ప్లానింగ్‌తో ‘మణిశంకర్’ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Kantamaneni : శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘మణిశంకర్’. జి.వి.కె. (జి. వెంకట్ కృష్ణన్) కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించడంతో పాటు దర్శకత్వమూ వహించారు. దీన్ని కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించిదని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ మూవీ గురించి సంగీత దర్శకుడు ఎం. ఎల్. రాజా మాట్లాడుతూ, ”సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. యాక్షన్స్, విజువల్స్ అన్నీ బాగుంటాయి. శంకర్ సర్ అద్భుతంగా నటించారు. సినిమా అంతా కూడా ఒకే టెంపోలో ఉంటుంది. సంజన, ప్రియా హెగ్డే బాగా నటించారు” అని అన్నారు.
హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, ”ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకుడిని లీనమయ్యేలా ఉంటుంది. జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. ఇళయరాజా శిష్యుడు ఎం. ఎల్. రాజా మా సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది” అని అన్నారు. డైరెక్టర్ జి. వెంకట్ కృష్టన్ మాట్లాడుతూ, ”మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఏ మనిషీ హీరోగా పుట్టడు. ప్రతి ఒక్కరిలో విలనిజం కూడా ఉంటుంది. ఈ కథలో హీరోలు, విలన్స్ ఎవరు అని ఉండరు. శంకర్ కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారు. సంజన పోషించిన పాత్రలోనూ చాలా డైమన్షన్స్ ఉన్నాయ్. అందుకే ఆమెను ఆ కారెక్టర్ కోసం అడిగాం. ప్రియా హెగ్డే, చాణక్య పోషించిన పాత్రలు కూడా బాగుంటాయి. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి. రెండు గంటలు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
Also Read
సంజన గల్రానీ మాట్లాడుతూ, ”కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబీ గారికి థాంక్స్. శివ గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో దీనిని నిర్మించారు. ఈ చిత్ర యూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది” అని అన్నారు.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!