మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని మా ప్రభుత్వ ఆకాంక్ష.. మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నిన్న బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు.. ఆ మాజీ మంత్రి తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Read Also: Alluarjun : పుష్ప 3 కూడా ఉండొచ్చు.. కన్ఫామ్ చేసిన ఐకాన్ స్టార్..
ఆ మాజీ మంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే 10 సంవత్సరాల్లో మీ గొంతు ఎందుకు మాట్లాడలేకపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు? మీరు ఎప్పుడైనా మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అడిగారా?.. నిన్న సలహాలు సూచనలు ఇవ్వమంటే.. ఎంత సేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతున్నారు.. అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే కుల గణన జరిపిన అయా రాష్ట్రాల నుంచి తెలుసుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. జనగణన సర్వే 100 శాతం ప్రయోజనం జరిగే విధంగా ముందుకు పోతాం.. నిధుల కొరత లేదు.. ఎలాంటి అనుమానం అవసరం లేదు.. మురళీదర్ రావు కమిషన్ లో విద్యార్థి దశగా ఉన్నప్పటి నుండే దీనిపై ఉద్యమించాం.. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందే వరకు మేము ఉన్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: India Forex Reserves : విదేశీ మారక నిల్వల్లో భారీ క్షీణత.. 617.23 బిలియన్ డాలర్లకు చేరిక
ఇక, కులగణన 1931లో చేసిన తరువాత 2011లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఇప్పుడే కుల గణన జరుగుతుంది.. భవిష్యత్ లో ఫిబ్రవరి 16 మరో చారిత్రాత్మక ఘట్టం.. మా పార్టీ నాయకత్వం అన్ని రకాలుగా సహకరించారు.. మేధావులు ఎవరైనా సలహాలు సూచనలు చెప్పాలి.. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అమలు చేసి తీరుతాం.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు అమలు చేశాం.. ఇది కూడా నా డిపార్ట్మెంట్ పరిధిలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టాం అని ఆయన చెప్పారు. బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని.. ఎంబీసీ కోసం గత ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదు.. మున్నరు కాపు, ముదిరాజ్, యాదవ్, పద్మశాలిలకి ప్రత్యేక సంస్థ ఉండడానికి కృషి చేస్తాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కోటి చేస్తామన్నారు. సర్కార్ వచ్చి 70 రోజులు కాలేదు.. ఎవరు ఆందోళన చెందవద్దు.. సకల జనుల సర్వే రిపోర్ట్ సభ ముందుంచాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.