Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి, పేద ప్రజలకు బయట తినడం అంటేనే గుండె గుభేల్ మంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో హోటల్ యజమానులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితులు కాస్త కుదుటపడినా… వినియోగదారుడికి మాత్రం ఆ వెసులుబాటు దక్కడం లేదు. ప్రతి చిన్న మార్పును తమకు అనుకూలంగా మార్చుకుంటూ కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు.
హోటల్ నిర్వాహకులు ధరలు పెంచడానికి ప్రధానంగా వినియోగిస్తున్న ఆయుధం ‘గ్యాస్ సిలిండర్’. సిలిండర్ ధరలు స్వల్పంగా పెరిగినా లేదా స్థిరంగా ఉన్నా.. ‘సకాలంలో సిలిండర్లు దొరకడం లేదు’, ‘బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తోంది’ అనే సాకులు చెబుతూ మెనూ కార్డులోని ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
Also Read
- Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం 'ఆక్సిజన్'.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
- Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని చెబుతూ.. అనధికారికంగా ఎక్కువ ధరకు కొంటున్నామనే వంకతో ఇడ్లీ, దోశ నుంచి బిర్యానీ వరకు అన్నింటి ధరలపై భారీగా పెంచుతున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే టిఫిన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. చట్నీ, సాంబార్ వంటి అదనపు వసతుల పేరుతో కూడా అదనపు బాదుడు తప్పడం లేదు.
హైదరాబాద్‌లోని ఇరానీ కేఫ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పెరుగుదల ఒక రేంజ్‌లో ఉంది. ఇదే ధోరణి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లోనూ కనిపిస్తోంది. పప్పులు, నూనె ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరవేయని యజమానులు, ఏదైనా ఒక వస్తువు ధర పెరగగానే మాత్రం వెంటనే బిల్లు పెంచేస్తున్నారు. సిలిండర్ల సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా, అది హోటల్ మెనూలో భారీ మార్పులకు దారితీస్తోంది.
నిజానికి సిలిండర్ ధరల పెరుగుదలపై ప్రభుత్వాల నియంత్రణ ఉన్నప్పటికీ.. హోటళ్లలో వసూలు చేసే ధరలపై పర్యవేక్షణ కరువైందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్లాక్ లో సిలిండర్లు కొంటున్నాం’ అని బహిరంగంగా చెబుతున్నా, అటు అధికారులు కానీ, ఇటు సరఫరాదారులు కానీ పట్టించుకోకపోవడం హోటల్ యజమానులకు వరంగా మారింది. నేడు కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటల్ యాజమాన్యాలు ఇంకాస్త రేట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సామాన్యుడు కష్టపడి సంపాదించిన డబ్బులో సగం కడుపు నింపుకోవడానికే సరిపోతోంది. గ్యాస్ సిలిండర్ దొరకడం లేదనే నెపంతో వినియోగదారులను మోసం చేయడం సరైన పద్ధతి కాదు. పారదర్శకమైన ధరలు ఉండాలని, సాకులు చెప్పి దోచుకునే హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!