Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
- ఏకంగా రూ.23 వేల కోట్ల ఏజీఆర్ బకాయిల తగ్గింపు
- గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలు
- తాజా తగ్గింపుతో రూ.64,046 కోట్లకు చేరిన బకాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘సంజీవని’ని అందించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల లెక్కల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలను సవరించిన టెలికాం శాఖ (DoT), కంపెనీకి భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీపై ఉన్న దాదాపు రూ.23,649 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. ఏజీఆర్ లెక్కింపుపై టెలికాం కంపెనీలు, ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం, వీఐ బకాయిలను భారీగా తగ్గించారు. గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలను ఇప్పుడు రూ.64,046 కోట్లకు సవరించారు. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాయిదాల పద్ధతిలో చెల్లింపులు..
బకాయిలను తగ్గించడమే కాకుండా, వాటిని చెల్లించే గడువును కూడా కేంద్రం వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి నాటికి కంపెనీ చెల్లించాల్సిన రూ.16,400 కోట్ల భారం ప్రస్తుతం తప్పుకుంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున చెల్లించాలి. మిగిలిన భారీ మొత్తాన్ని 2035-36 నుంచి 2040-41 మధ్య ఆరు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని నివారించేందుకు కేంద్రం వరుసగా వీఐని ఆదుకుంటూ వస్తోంది. ఇప్పటికే 2021 ప్యాకేజీ కింద బకాయిల వడ్డీని ఈక్విటీగా మార్చడంతో ప్రభుత్వానికి కంపెనీలో 33% వాటా లభించింది. ఇప్పుడు ఏజీఆర్ తగ్గింపుతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడనుంది.
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా..
ప్రస్తుతం కంపెనీపై రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీకి నగదు లభ్యత పెరిగి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ నిధులతో నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు వీఐ సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?