Site icon NTV Telugu

Telangana 2k run: తెలంగాణ వ్యాప్తంగా 2కే రన్.. పోలీస్ శాఖ అధ్వర్యంలో కార్యక్రమం

Hyd 2k Run

Hyd 2k Run

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా ఈ రన్‌ కొనసాగింది. పోలీస్‌ వాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 2కే రన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రొగ్రాంలో పాల్గొన్నారు.

Read Also : Fake Smartphone Deal: iPhone 14 Pro Max కేవలం రూ. 5000కే త్వరపడండి

అయితే హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంత్రి మహమూద్‌ అలీ 2కే రన్‌ను స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, సింగర్స్ మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ 2కే రన్‌లో పాల్గొన్నారు.

Read Also : World Cup 2023: ఉప్పల్ లో టీమిండియా మ్యాచ్ లు లేనట్లే..?

ఇక రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రి నిరంజన్‌ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాపై తిరంగా యాత్ర నిర్వహించారు. కోట వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు.

Read Also : Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రన్‌ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి జగదీశ్‌ రెడ్డి స్టార్ట్ చేశారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్ తెలంగాణ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, రాచకొండ సీపీ చౌహాన్‌ పాల్గొన్నారు.

Exit mobile version