Teja sajja : ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. మైండ్ బ్లాకయ్యేలా గ్లింప్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా “హనుమాన్” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే ..టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించిన హనుమాన్ మూవీ తేజ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది ..త్వరలోనే “జై హనుమాన్” సినిమాతో వీరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.కానీ అంతకు ముందే తేజ సజ్జా మరో సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఘట్టమనేని కార్తీక్తో తేజ సజ్జా సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే.ఇటీవలే ఈగల్ వంటి బిగ్ యాక్షన్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీక్ ఇప్పుడు తేజ సజ్జాను సరి కొత్త కథలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ మూవీని ప్రీ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేస్తూ ‘ఒక యోధుడి గొప్ప సాహసం’ అంటూ చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్ మూవీ టైటిల్ మరియు గ్లింప్స్ ఏప్రిల్ 18 న అనౌన్స్ చేస్తామని ప్రకటించారు..
తాజాగా నేడు ఆ చిత్ర గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేసారు. కళింగ యుద్ధం తరువాత యుద్ధం వదిలి యోగిగా మారిన అశోకుడు రహస్యంతో ఈ సినిమా కథాంశం మొదలు కానుంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ.అశోకుడు వద్ద వున్న తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొంత మంది ప్రయత్నిస్తుంటారు.అయితే ఆ అపార గ్రంథాన్ని కాపాడే యోధుడి పాత్రలో తేజ సజ్జా నటించబోతున్నారు.అలాగే ఈ సినిమాకి ‘మిరాయ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ గ్లింప్స్ చూసాక తేజ సజ్జా ఈ సారి హనుమాన్ మూవీకి మించి సక్సెస్ అందుకోముమ్మాటీలు అర్ధం అవుతుంది .ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు.అలాగే మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు . అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!