HanuMan : హనుమాన్ ఓటీటీ ప్రమోషన్స్ కు సిద్ధం అయిన తేజ సజ్జా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజై బంపర్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ టీమ్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. హిందీ వెర్షన్ ఓటీటీ డేట్ ఖరారైనా.. ఇతర భాషల విషయంలో ఇంకా ఉత్కంఠ నెలకొంది.హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డేట్, టైమ్ ఇప్పటికే ఖరారయ్యాయి. హనుమాన్ హిందీలో మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది.
మార్చి 16వ తేదీనే హనుమాన్ హిందీలో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో, హిందీ వెర్షన్ ఓటీటీ కోసం ప్రమోషన్లను చేసేందుకు హీరో తేజ సజ్జా సిద్ధం అయ్యారు.హనుమాన్ హిందీ వెర్షన్ ఓటీటీ ప్రమోషన్ల కోసం తేజ సజ్జా ముంబై చేరుకున్నారు. ఈ విషయాన్ని నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. “సమ్‍థింగ్ ఫన్ రానుంది” అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అఫీషియల్ జియో సినిమా అంటూ ట్యాగ్ చేశారు. దీంతో హనుమాన్ హిందీ ఓటీటీ వెర్షన్ కోసం ప్రమోషన్లను ఆయన రెడీ అయ్యారని తెలుస్తోంది. హిందీ వెర్షన్ ప్రీమియర్ గురించి వీడియోలు చేసే ఛాన్స్ కూడ ఉంది.హనుమాన్ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రావాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు ఈ స్ట్రీమింగ్ డేట్ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ అప్‍డేట్ ఇచ్చారు
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!