డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!

Tecno Camon 50 Ultra 5g

Tecno Camon 50 Ultra 5g

టెక్నో నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 50 Ultra 5Gను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జూలై 17 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో పరిచయమైన ఈ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

AI కెమెరా ఫీచర్లే హైలైట్:

“Sees It All” అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన అధునాతన AI ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తోంది. క్షణాల్లో తీసిన ఫొటోలను మరింత అందంగా మార్చే టెక్నాలజీ ఇందులో ఉంది. ఈ ఫోన్‌లో అందించే ముఖ్యమైన AI ఫీచర్లు ఇవే..

* AI Photo Enhancement: ఫొటోలలోని వివరాలను ఆటోమేటిక్‌గా మెరుగుపరుస్తుంది.
* AI Object Removal: ఫొటోల్లో అనవసరంగా కనిపించే వ్యక్తులు లేదా వస్తువులను సులభంగా తొలగించవచ్చు.
* AI Content Creation Tools: మొబైల్‌లోనే ఫొటోలు, వీడియోలను వేగంగా ఎడిట్ చేసుకునే సౌకర్యం.
అలాగే వెనుక భాగంలో మల్టీ కెమెరా సెటప్‌తో పాటు ప్రత్యేక ఫ్లాష్ మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించింది.

ప్రీమియం లుక్:

TECNO CAMON 50 Ultra 5Gలో కంపెనీ “Silk-Flow” డిజైన్‌ను ఉపయోగించింది. స్లిమ్ బాడీ, షైనింగ్ ఫినిష్, మంచి నిర్మాణంతో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. రోజంతా ఉపయోగించుకునేలా భారీ బ్యాటరీని కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

డాల్బీ ఆటమ్స్ సపోర్ట్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్ (Dolby Atmos) సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో సినిమాలు చూడటం, గేమింగ్, మ్యూజిక్ వినేటప్పుడు మెరుగైన ఆడియో అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు. ఈ మొబైల్ సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్, నెబ్యులా టైటానియం అనే 3 స్టైలిష్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.

జూలై 17న లాంచ్ అయిన తర్వాత అమెజాన్ ద్వారా ఈ TECNO CAMON 50 Ultra 5Gను కొనుగోలు చేయవచ్చు. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.