Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
- టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్
- ఈ వాచ్ ధర 999 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.95,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైమెక్స్ (Timex) తన కొత్త ప్రీమియం డైవింగ్ వాచ్ Deepwater Meridian 300 Titanium HEV Automaticను అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేకంగా డైవింగ్, అడ్వెంచర్ ప్రియుల కోసం రూపొందించిన ఈ మెకానికల్ వాచ్ 300 మీటర్ల లోతు వరకు నీటి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. టైటానియం బాడీ, సఫైర్ క్రిస్టల్ డిస్ప్లే, ఆటోమేటిక్ మూవ్మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ వాచ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ధర ఎంత?
Timex Deepwater Meridian 300 Titanium HEV Automatic ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ ధర 999 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.95,000)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది టైమెక్స్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో 44mm డయల్ అందించారు. కేస్‌ను గ్రేడ్-5 టైటానియంతో తయారు చేయడం వల్ల ఇది బరువు తక్కువగా ఉండటంతో పాటు అత్యంత బలంగా ఉంటుంది.
Also Read
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
44mm డయల్
15mm మందం
51mm లగ్-టు-లగ్ పొడవు
మ్యాట్ ఫినిష్ టైటానియం కేస్
సఫైర్ క్రిస్టల్ గ్లాస్
యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్
సఫైర్ క్రిస్టల్ డిస్ప్లే గీతల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా సన్ లైట్ లో కూడా స్పష్టమైన విజిబిలిటీని అందిస్తుంది.
300 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్
ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణ 300 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్. ప్రొఫెషనల్ డైవింగ్ అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. దీనిలో స్క్రూ-డౌన్ క్రౌన్, క్రౌన్ గార్డ్, స్క్రూ-డౌన్ కేస్ బ్యాక్, ఆటోమేటిక్ హీలియం ఎస్కేప్ వాల్వ్ (HEV) వంటి ప్రత్యేక డైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. శాచురేషన్ డైవింగ్ సమయంలో వాచ్ లోపల పేరుకుపోయే హీలియం వాయువును HEV సురక్షితంగా బయటకు పంపుతుంది. దీంతో అంతర్గత ఒత్తిడి పెరగకుండా ఉండి వాచ్ గ్లాస్‌కు నష్టం జరగకుండా కాపాడుతుంది.
ఆటోమేటిక్ మూవ్మెంట్
ఈ వాచ్‌లో Miyota 8215 Automatic Movementను ఉపయోగించారు. ఇది 21 జ్యువెల్ జపనీస్ మెకానికల్ క్యాలిబర్, చేతి కదలికతో ఆటోమేటిక్‌గా విండ్ అవుతుంది. గరిష్టంగా 40 గంటల పవర్ రిజర్వ్, అవసరమైతే క్రౌన్ ద్వారా మాన్యువల్ విండింగ్ సపోర్ట్ అందిస్తుంది.
రెండు కలర్ ఆప్షన్లు
Timex ఈ వాచ్‌ను రెండు రంగుల్లో అందిస్తోంది. బ్లాక్ డయల్, గ్రీన్ డయల్. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించేలా జపనీస్ Nemoto Luminova SG2200 ల్యూమినస్ కోటింగ్‌ను డయల్‌పై ఉపయోగించారు.
స్ట్రాప్ కూడా ప్రత్యేకమే
ఈ వాచ్‌లో 20mm HNBR (Hydrogenated Nitrile Butadiene Rubber) స్ట్రాప్‌ను అందించారు. ఈ స్ట్రాప్ యూవీ రేస్ రెసిస్టెన్స్, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం, రసాయనాల ప్రభావానికి రక్షణ, దీర్ఘకాలిక మన్నిక వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?