NTV Telugu Site icon

IND vs NED: ఫైనల్ టచ్ ఇచ్చిన భారత్.. నెదర్లాండ్స్ పై టీమిండియా ఘన విజయం

Ind Won

Ind Won

టీమిండియా ఈ వరల్డ్ కప్ లో విజయాల పరంపర కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన లీగ్ మ్యాచ్ ల్లో అన్నింటిలోనూ గెలిచింది. ఈరోజు జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లోనూ భారత్ ఫైనల్ టచ్ ఇచ్చి.. విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో హైలెట్ ఏంటంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బౌలింగ్ వేసి తలో వికెట్ తీశారు. ఫ్యాన్స్ వీరిద్దరు బౌలింగ్ చేయాలన్న కోరిక మేరకు.. బౌలింగ్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ బ్యాట్‌ల నుంచి హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

Read Also: CM KCR: రెండో విడత ప్రచారానికి సిద్ధమైన గులాబీ బాస్.. రేపటి నుంచి షురూ

411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఆరంభంలోనే సిరాజ్ దెబ్బ తీశాడు. వెస్లీ బరేసీ (04)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మాక్స్ ఓడౌడ్ 30, కోలిన్ అకెర్‌మాన్ 35, అకర్‌మన్ 35, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్‌ 45, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ 17, డీలీడ్ 12, తేజ నిడమనూరు 54, వాన్ బీక్ 16, వాన్ డర్ మెర్వ్ 16 పరుగులు చేశారు. ఇక.. భారత్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు. వీరితో పాటు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Read Also: Business News: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం