NTV Telugu Site icon

IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్

Virat Kohli Duck

Virat Kohli Duck

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆదివారం ముగిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. భారత గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. భారత జట్టు 29.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కామెంట్స్ చేస్తున్నారు.

Constable who shot SI: సర్వీస్ రైఫిల్‌తో ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్.. కారణం?

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శన చూపించారు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో వీరిద్దరు పరుగుల కోసం ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ రోహిత్ శర్మ కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో 2, 52 పరుగులు చేయగా.. రెండో టెస్టులో 0, 8 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టుల్లో 18, 11 పరుగులు చేశాడు. కోహ్లీ మూడు టెస్టుల్లో కలిపి 93 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 0, 70.. రెండో ఇన్నింగ్స్ లో 1, 17.. మూడో టెస్టులో 4, 1 పరుగులు చేశాడు. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లడంపై మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ అక్కడికి వెళ్లడమే మంచిదని జనాలు అంటున్నారు. తన వికెట్ పడే వరకు ఉన్నాడు, ఆ తర్వాత ఔట్ కాగానే లండన్‌కు బయలుదేరాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను కూడా ట్రోల్ చేస్తున్నారు.

Omar Abdullah: ఉగ్రదాడిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..