NTV Telugu Site icon

IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి

Ind Vs Afg

Ind Vs Afg

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కాసేపట్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌లో పునరాగమనం చేస్తున్నాడు.

టీ-20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇరు జట్లు మొత్తం 6 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. అందులో భారత్ 5 గెలిచి, 1 మ్యాచ్ అసంపూర్తిగా ఉంది. కాగా.. ఇరు జట్ల మధ్య తొలిసారిగా టీ20 సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా చివరి టీ20 సిరీస్‌ను ఆడుతోంది.

Read Also: Congress: కాంగ్రెస్‌కి దెబ్బ మీద దెబ్బ.. 2019 నుంచి పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు వీరే..

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికె), అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ, నూర్ అహ్మద్, ముజీబ్.

Show comments