Site icon NTV Telugu

IND vs ENG 2nd ODI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

Ind Won

Ind Won

కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 2-0 తో భారత్ ఆధిక్యంలో ఉంది. దీంతో.. వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు.

Read Also: Viral Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 23 ఏళ్ల యువతి..

భారత్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా.. విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41) పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 2 వికెట్లు సాధించాడు. అటిక్సన్, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు సాధించారు. చివర్లో లివింగ్‌స్టన్ 32 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బట్లర్ (34), ఫిల్ సాల్ట్ (26) పరుగులు చేశారు. భారత్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. షమీ, హర్షి్త్ రాణా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. కాగా.. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు.. టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. కాగా.. మూడో వన్డే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.

Read Also: Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. సీఎం, రవాణాశాఖ మంత్రి దిగ్భ్రాంతి ..

Exit mobile version