NTV Telugu Site icon

Team India Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా భారత మాజీ మహిళా క్రికెటర్‌!

Nooshin Al Khadeer Head Coach

Nooshin Al Khadeer Head Coach

Nooshin Al Khadeer Named Interim Head Coach for India Women’s Team: దాదాపుగా 5 నెలల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. జులై 9 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం తాజాగా 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజాగా హెడ్‌ కోచ్‌గా భారత మాజీ మహిళా క్రికెటర్‌ను ఎంపిక చేసింది.

2022 డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ రమేశ్ పొవార్‌ని బీసీసీఐ బదిలి చేసింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి అతడిని పంపించేసింది. దీంతో అప్పటి నుంచి కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతోంది. 2023 ఏప్రిల్‌లో హెడ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవి కోసం ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్‌ ‍తుషార్ అరోథే, దేశవాళీ దిగ్గజం అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Nabha Natesh Latest Pics: నభా నటేష్‌ అందాల విందు.. ‘ఇస్మార్ట్’ పోరి గ్లామర్‌కు కుర్రాళ్లు ఫిదా!

రెండేండ్ల కాలానికి అమోల్ ముజుందార్ హెడ్‌ కోచ్‌గా రానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కమిటీ కూడా అతడిని ఫైనల్‌ చేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్‌ను తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.

బంగ్లాదేశ్‌ పర్యటనకు ముందే నూషిన్ అల్ ఖదీర్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే ఆమెకు తొలి పరీక్ష కానుంది. బంగ్లాదేశ్ టూర్ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఆ తర్వాత పలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అప్పటివరకు నూషిన్ ఉంటుందో లేదో చూడాలి.

Also Read: Praveen Kumar Car Accident: ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ భారత మాజీ ప్లేయర్!