NTV Telugu Site icon

Team India Schedule 2023: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే ఇక.. 20 రోజుల్లో 14 మ్యాచ్‌లు! షెడ్యూల్ ఇదే

Indian Cricket Fans

Indian Cricket Fans

Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌ వచ్చే నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్‌లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్‌లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే ఈ సంఖ్య పెరగనుంది.

సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ సేన 2 వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. వార్మప్ మ్యాచ్‌ల తర్వాత వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న భారత్ మెగా టోర్నీ ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. నవంబర్ 12 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. దాంతో వచ్చే 4 వారాల్లో భారత క్రికెట్ ఫాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. వచ్చే వారాల్లో భారత్ షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

భారత్-ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్:
సెప్టెంబర్ 22: మొదటి వన్డే-మొహాలీ
సెప్టెంబర్ 24: రెండవ వన్డే-ఇండోర్
సెప్టెంబర్ 27: మూడో వన్డే-రాజ్‌కోట్

భారత్ వన్డే ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:
సెప్టెంబర్ 30: భారత్ vs ఇంగ్లండ్-గౌహతి
అక్టోబర్ 3: భారత్ vs నెదర్లాండ్స్-తిరువనంతపురం

Also Read: Today Gold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

భారత్ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్:
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా-చెన్నై
అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్-ఢిల్లీ
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్-అహ్మదాబాద్
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్-పూణె
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్-ధర్మశాల
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్-లక్నో
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక-ముంబై
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా-కోల్‌కతా
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్-బెంగళూరు