Team India: భారత్‌కు ‘అగ్నిపరీక్ష’.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే! సెమీస్ రేస్‌లో నిలవాలంటే ఇదే బెస్ట్ సీనారియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్‌కు నేడు తొలి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. సూపర్ -8 తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జింబాబ్వే మ్యాచ్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు.. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్, భారత్ vs జింబాబ్వే మ్యాచ్‌లు సైతం భారత్‌ను ప్రభావితం చేయనున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టిక చూస్తే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండూ ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే ఖాతాలు ఇంకా తెరవలేదు. అయితే భారత్ నెట్ రన్‌రేట్ భారీగా మైనస్‌లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
Also Read
భారత్ సెమీస్‌కు చేరాలంటే.. ముందుగా దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడించాలి. నేటి మ్యాచ్‌లో భారత్ జింబాబ్వేపై గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుతుంది. భారత్, వెస్టిండీస్ టీమ్‌లు చెరో 2 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మార్చి 1న జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ నేరుగా ‘క్వార్టర్ ఫైనల్’లా మారుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెట్ రన్‌రేట్‌కు సంబంధం లేకుండా సెమీస్‌కు వెళ్తుంది. భారత్‌కు ఇదే బెస్ట్ సీనారియో. ఈ దారి తప్పిదో మరో దారి సైతం ఉంది. వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడించి, భారత్ జింబాబ్వేపై గెలిస్తే వెస్టిండీస్ 4 పాయింట్లతో టాప్‌లో ఉంటుంది. అప్పుడు భారత్ వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జింబాబ్వే దక్షిణాఫ్రికాను ఓడించాలి. ఈ ఓటమి స్వల్ప తేడాతో ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్‌కు అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. సెమీఫైనల్ ఆశలు దాదాపు ముగిసినట్టే. కానీ.. చివరిగా ఒక్క ఆశ మాత్రం మిగిలే ఉంటుంది. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిచి 6 పాయింట్లు సాధించాలి. తర్వాత భారత్ వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు మూడు జట్లు 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఒక్క జట్టుకే సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. మొత్తానికి భారత్‌కు ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఫైనల్‌లాంటిదే. ముందుగా జింబాబ్వేపై గెలవడం తప్పనిసరి. భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ఏం జరుగుతుందో చూద్దాం..
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!