Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు, ప్రళయకారక వరదలతో నేపాల్ తీవ్రంగా విలవిలలాడుతోంది. కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు, మౌలిక వసతులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో జనాలు తమ సర్వస్వాన్ని కోల్పోయి వీధిన పడ్డారు. ఇలాంటి విపత్తు సమయంలో విపరీతమైన నష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుండగా, మానవత్వంలోని రెండు విభిన్న కోణాలు బయటపడ్డాయి. ఒకవైపు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి కొందరు ఆభరణాలను దొంగిలించిన దారుణ ఘటన కలకలం రేపింది. నారాయణి నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహం నుంచి కొందరు దుండగులు బంగారు కమ్మలను దొంగిలించగా.. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవ్వగా.. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు వెనువెంటనే అరెస్టు చేశారు.
అయితే ఇదే సమయంలో మానవత్వాన్ని చాటిచెప్పే మరొక సంఘటన వెలుగుచూసింది. త్రిశూలి నది వరద ఉధృతికి మట్టితో కూడిన ఒక కబోర్డ్ కొట్టుకొచ్చింది. నిర్మల్ పర్సాయి అనే యువకుడు, అతని స్నేహితులు ఆ కబోర్డును తెరిచి చూడగా.. అందులో పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు లభించింది. ఆ అల్మారాలోని ఒక బిల్లుపై ‘జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్’ అని రాసి ఉండటాన్ని వారు గమనించారు.
Also Read
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
కోట్లాది రూపాయల విలువైన ఆ సంపదను చూసి ఎలాంటి ఆశకు పోకుండా ఆ యువకులు సోషల్ మీడియా వేదికగా లభించిన బంగారం నగదు వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా.. వాటి యజమానులు సరైన ఆధారాలతో తమను లేదా స్థానిక పోలీసులను సంప్రదించి తమ సొత్తును తీసుకెళ్లాలని కోరారు. నేపాల్‌లో వరదలు సృష్టిస్తున్న ఈ విషాద సమయంలోనూ, స్వార్థం లేకుండా బాధితుడికి ఆస్తిని తిరిగి అందించేందుకు ముందుకొచ్చిన ఆ యువకుడి నిజాయితీకి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!