NTV Telugu Site icon

Team India: శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో

Team India

Team India

మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూలై 22న శ్రీలంకకు చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు నుంచి భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్. అలాగే.. టీ20 కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు కూడా ఇది మొదటి టూర్. టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.. అనంతరం.. రవీంద్ర జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించగానే.. కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. వాస్తవానికి. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందువల్ల సూర్యనే కెప్టెన్సీకి ఉత్తమ ఎంపికగా భావించారు.

Read Also: Italy: మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఎయిర్‌పోర్టు మూసివేత

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచ కప్ తర్వాత, టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. ఆ పర్యటనలో జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. భారత్ వర్సెస్ శ్రీలంక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్.. జూలై 27 నుండి జూలై 30 వరకు పల్లెకెలెలో జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు జూలై 27, 28 తేదీల్లో జరగనుండగా.. చివరి మ్యాచ్ జూలై 30న జరగనుంది. ఆ తర్వాత భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది.